'చట్టం ప్రకారం శిక్షిస్తాం'.. రెడ్ బుక్ అంటే ఇదే.. మంత్రి లోకేష్ క్లారిటీ
రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్టం ప్రకారం శిక్షించడమేనని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
By అంజి Published on 16 Aug 2024 11:12 AM IST
'చట్టం ప్రకారం శిక్షిస్తాం'.. రెడ్ బుక్ అంటే ఇదే.. మంత్రి లోకేష్ క్లారిటీ
రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్టం ప్రకారం శిక్షించడమేనని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న వైసీపీ విమర్శలపై ఆయన స్పందించారు. గత ఐదేళ్లలో తాను పాల్గొన్న ప్రతి మీటింగ్‌లో ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పానన్నారు. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పిచ్చారని అన్నారు. జోగి రమేష్ కుమారుడు భూమి కబ్జా చేశాడని, అతని గురించి ప్రజలకు తెలియాలన్నారు. భూకబ్జా చేసిన వారిని వదిలేయాలా? అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు.
రేపు లిక్కర్ స్కాం మీద చర్యలు ఉంటాయని, ఇసుక దందాపై కూడా చర్యలు ఉంటాయని అన్నారు. ప్రతి స్కాం మీద చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. వైసీపీ నాయకులతో అంటకాగి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం శిక్షిస్తామని నారా లోకేశ్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని తాను వొదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
#AndhraPradesh ----రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్టం ప్రకారం శిక్షించడమేనని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న వైసీపీ విమర్శలపై ఆయన స్పందించారు. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పిచ్చారని అన్నారు pic.twitter.com/UR9ll81dkZ
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 16, 2024