అమరావతి: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్షలను మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహిస్తామని ఎస్‌ఎస్‌సీ బోర్డు 2025 నవంబర్‌లో వెల్లడించింది. మార్చి 20న ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది పేర్కొంది. అయితే ఆ రోజు రంజాన్ కావడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో పరీక్షను మార్చి 21న జరిపే అవకాశం ఉంది. కాగా కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం మార్చి 20న రంజాన్ పండగ ఉండటంతో ఈ మార్పు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపితే.. ఈ ఒక్క తేదీ మారనుంది. మిగతా పరీక్షలు యథావిథిగా జరగనున్నాయి. దీనికి సంబంధించి రేపోమాపో అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్
మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20, 2026 జరగాల్సిన ఇంగ్లీష్ మార్చి 21న జరిగే అవకాశం
మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
మార్చి 25, 2026 – ఫిజిక్స్
మార్చి 28, 2026 – బయాలజీ
మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు