ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే కళ్యాణమస్తు, షాదీ తోఫా

The YSR Kalyanamastu and Shaadi Tofa schemes will be launched by the YCP government from October 1. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే

By అంజి  Published on  11 Sept 2022 3:09 PM IST
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే కళ్యాణమస్తు, షాదీ తోఫా

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు , షాదీ తోఫా పథకాలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేయనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాలను అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, వికలాంగుల వివాహానికి రూ.1.5 లక్షలు ప్రభుత్వం ప్రకటించింది.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, బీసీలు, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని ఏపీ సీఎంఓ అధికారులు వెల్లడించారు. నిరుపేద ఆడబిడ్డల కుటుంబాలను ఆదుకునేందుకు, వారికి గౌరవప్రదమైన పెళ్లిళ్లు చేసేందుకు జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వైసీపీ నేతలు తెలిపారు. వైఎస్ జగన్ ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేశారని, సంక్షేమ పథకాల అమలులో తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని వైసీపీ నేతలు కొనియాడారు.

ఈ పథకం కింద గత ప్రభుత్వం కంటే ఎక్కువ నగదు సాయం అందుతుందని వైసీపీ నాయకులు తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో 'చంద్రన్న పెళ్లి కానుక' పథకం కింద ఎస్సీలకు రూ. 40,000, ఎస్టీలకు రూ.50,000లు అందేవి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది. దీంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story