BREAKING: టీడీపీ మూడో జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు విడుదల చేశారు.

By అంజి  Published on  22 March 2024 10:49 AM IST
TDP, MP candidates , MLA candidates, APnews

BREAKING: టీడీపీ మూడో జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు విడుదల చేశారు. 11 ఎమ్మెల్యే, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది.

Next Story