ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవరించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రేపటిలోగా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో మొత్తం 3,736 మద్యం షాపుల కేటాయింపులకు రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇందులో 340 షాపులను కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం రిజర్వ్ చేయనుంది.
కల్లు గీత వృత్తిదారుల జనాభా ఏ జిల్లాలో, ఏయే నియోజకవర్గాల్లో ఎంతమేర ఉందనే అంశంపై ప్రభుత్వం వివరాల సేకరణ చేపట్టింది. వివరాల సేకరణ తర్వాత బీసీ సంక్షేమ శాఖ నుంచి ఎక్సైజ్ శాఖ వివరాలు తీసుకోనుంది. ఆ తర్వాత ఎక్సైజ్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపేలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చట్టం చేశారు. ఆ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ఆర్డినెన్స్‌కు త్వరలోనే గవర్నర్ ఆమోదం తెలిపి అవకాశం ఉంది.