విజయవాడలో కొత్త టెర్మినల్ విషయంలో గుడ్ న్యూస్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (వీఐఏ) లో కొత్త టెర్మినల్ వచ్చే ఏడాది జూన్ నాటికి సిద్ధం కానుంది.
By అంజి Published on 6 Oct 2024 12:54 PM ISTవిజయవాడలో కొత్త టెర్మినల్ విషయంలో గుడ్ న్యూస్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (వీఐఏ) లో కొత్త టెర్మినల్ వచ్చే ఏడాది జూన్ నాటికి సిద్ధం కానుంది. ఏఏసీ చైర్మన్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైస్ చైర్మన్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తో సహా వీఐఏ ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ (ఏఏసీ) విమానాశ్రయం ఆవరణలో సమావేశమైంది. ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ జనవరి నాటికి కొత్త టెర్మినల్ కాంక్రీట్ పనులు పూర్తి చేస్తామన్నారు. వచ్చే జూన్ చివరి నాటికి మిగిలిన పనులు పూర్తయిన తర్వాత టెర్మినల్ వినియోగానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
విమాన ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో టెర్మినల్ నిర్మాణాన్ని వేగంగా పూర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతివారం సమావేశమై పనుల పురోగతిని సమీక్షించాలని కమిటీ సభ్యులు తీర్మానించారు. విజయవాడ ఎంపీ శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన కొత్త విమాన సర్వీసులు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయన్నారు. పలు నగరాలకు విజయవాడ నుండి విమాన సేవలను పెంచాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి లేఖ రాశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు విమానాశ్రయానికి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నందున విమాన ప్రయాణికుల ప్రయోజనం కోసం క్యాబ్ సేవలను ప్రవేశపెట్టాలని శివనాథ్ కోరారు.