రాష్ట్రం నుంచి తొలిసారిగా హజ్ యాత్రికుల ప్రయాణం విజయవాడ అంతార్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభం అవుతుండటం ఒక సరికొత్త అధ్యాయం అని డిప్యూటి సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. జూన్ 7 నుంచి విజయవాడ అంతార్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రికుల రాకపోకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి చైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజాంతో కలిసి బుదవారం విమానాశ్రయాన్ని పరిశీలించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టరు లక్ష్మికాంత్ రెడ్డి, విమానాశ్రయం భద్రతాధికారి వెంకటరత్నం సిబ్బందితో విమానాశ్రయ ప్రాంగంణం అంతా పరిశీలించారు. డిపార్చర్, అరైవల్, కష్టమ్స్ ఏరియాలను పరిశీలించారు. వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా అంజాద్ బాషా మాట్లడుతూ.. జూన్ 7న మొదటి విమానంలో హజ్ యాత్రకు 155 మంది హాజీలు బయలుదేరతారన్నారు. 22 తేదీవరకు ప్రతిరోజూ హాజీలతో ప్రత్యేక విమానాలు విజయవాడ విమానాశ్రయం నుండి బయలుదేరతాయన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో అన్ని రకాల ఏర్పాట్లను చేశామన్నారు. హాజీలు వెళ్ళడం, తిరుగు ప్రయాణం విజయవాడ నుంచి కొనసాగనున్న నేపథ్యంలో ముఖ్యమంతి జగన్ ప్రత్యేక పర్యవేక్షణలో ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా వుంటుందన్నారు.