ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తా..జగన్ సంచలన ప్రకటన

వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు

By Knakam Karthik
Published on : 1 July 2025 4:31 PM IST

Andrapradesh, Former Cm Jagan, Ap Politics, Padayatra

ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తా..జగన్ సంచలన ప్రకటన

వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల ముందు తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. వైసీపీ యువ నేతలతో సమావేశంలో వైఎస్ జగన్ ఈ ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ సోషల్ మీడియా వింగ్‌ను బలోపేతం చేయాలి. ఈ రోజుల్లో ఫోనే ఆయుధం. ఎవరికైనా అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. నా పాదయాత్రలో సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కలుస్తా..అని జగన్ పేర్కొన్నారు.

ఆర్గనైజేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఎంప్యానల్ కావాలని చెప్పారు. ఈ రోజు ఉన్న సోషల్ మీడియా యుగంలో ఫోన్ అనేది గన్ లాంటిది అని..జగన్ చెప్పారు. ఆర్గనైజేషన్ పరంగానూ భాగస్వామ్యం కావాలని జగన్ సూచించారు. మీరు పార్టీ కోసం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటే, నా రాబోయే పాదయాత్రలో నేను మీ పేర్లను ప్రస్తావిస్తాను. మీతో మాట్లాడతాను" అని వైఎస్ జగన్ అన్నారు. కాగా 2019 ఎన్నికలకు ముందు 'ప్రజా సంకల్ప యాత్ర' చేపట్టారు.

Next Story