AP: వాలంటీర్లను విధుల నుంచి బహిష్కరణ.. ఈసీ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వార్డు, గ్రామ వాలంటీర్లు సంక్షేమ ఫలాలు అందజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

By అంజి
Published on : 31 March 2024 10:29 AM IST

Election Commission, Andhra Pradesh government, volunteers , APPolls

AP: వాలంటీర్లను విధుల నుంచి బహిష్కరణ.. ఈసీ ఉత్తర్వులు 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వార్డు, గ్రామ వాలంటీర్లు సంక్షేమ ఫలాలు అందజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించిందని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మోడల్ ప్రవర్తనా నియమావళి (MCC) అమలులో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) ఫలితాలను విడుదల చేయకుండా, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్ష (APTRT) ను నిర్వహించకుండా ఉండాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

వార్డు, గ్రామ వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ ఆదేశాలపై మీనా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ప్రయోజనాలను పొడిగించడం, పింఛన్ల పంపిణీ,యు ఇతర సంబంధిత కార్యకలాపాల పట్ల వాలంటీర్లు నిమగ్నమై ఉండరాదని మీనా అన్నారు. వాలంటీర్లకు ఇచ్చిన సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర పరికరాలను వెంటనే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులకు జమ చేయాలని ఆయన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఇంకా, ప్రభుత్వ అధికారులను నియమించడం వంటి ప్రత్యామ్నాయ పద్ధతిలో ప్రభుత్వ పథకాలను పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వార్డు, గ్రామ వాలంటీర్ల ద్వారా వికేంద్రీకృత పాలన డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో వాలంటీర్ 50 ఇళ్లను చూసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Next Story