పొలాల్లో మద్యం సేవిస్తున్న వారిని పట్టించిన డ్రోన్..సారీ గాయ్స్ అంటూ లోకేశ్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు.

By Knakam Karthik
Published on : 7 April 2025 7:50 AM

Andrapradesh, Minister Nara Lokesh, Ap Police, Drone Camera

పొలాల్లో మద్యం సేవిస్తున్న వారిని పట్టించిన డ్రోన్..సారీ గాయ్స్ అంటూ లోకేశ్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు. పొలాల్లో మద్యం సేవిస్తూ రిలాక్స్ అవుతున్న ఇద్దరు యువకులను ఉద్దేశించి కెనాట్ హెల్ప్ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఆ వీడియోను కృష్ణా జిల్లా పోలీసులు ఎక్స్‌లో పోస్టు చేయడంతో మంత్రి నారా లోకేశ్ రీట్వీట్ చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో ఇంజినీరింగ్ కాలేజీ వైపు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారని పోలీసులు డ్రోన్ ద్వారా గుర్తించారు. ఒక్కసారిగా డ్రోన్‌ను చూసి షాక్ అయిన ఆ ఇద్దరు యువకులు చేతిలో గ్లాస్‌లు పడేసి పరుగులు తీశారు. పోలీసుల డ్రోన్ మాత్రం వారినే వెంటాడింది. చివరగా రోడ్డు వైపు నిలిపిన వారి బైకు దగ్గరకు వచ్చారు. అనంతరం వారి ఇద్దరిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ వీడియోను కృష్ణా జిల్లా పోలీసులు పోస్ట్ చేయడంతో.. పోలీసులు డ్రోన్ల ద్వారా వారి డ్యూటీ చేశారంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

కాగా ఏపీ వ్యాప్తంగా అసాంఘిక చర్యలను గుర్తించేందుకు రాష్ట్ర పోలీసులు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఇలాంటి వీడియోనే హోంమంత్రి అనిత కూడా పోస్ట్ చేశారు. ఓ లారీలో దర్జాగా కూర్చుని పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ సహాయంతో పోలీసులు ఐడెంటిఫై చేశారు. కాగా ఇలాంటి అసాంఘిక చర్యలను డ్రోన్ కెమెరాల ద్వారా కట్టడి చేస్తున్నట్లు ఏపీ పోలీసులు వెల్లడిస్తున్నారు.

Next Story