బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి.. సురక్షితంగా బయటకు తీసిన డాక్టర్లు

పొరపాటున చిన్న బ్యాటరీని మింగిన 11 నెలల పాపను డాక్టర్లు కాపాడారు. పాప కడుపులో నుండి బ్యాటరీని డాక్టర్లు సురక్షితంగా బయటకు తీశారు.

By అంజి  Published on  16 Jun 2024 12:00 PM IST
Tadepalligudem, West Godavari District, APNews

బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి.. సురక్షితంగా బయటకు తీసిన డాక్టర్లు

పొరపాటున చిన్న బ్యాటరీని మింగిన 11 నెలల పాపను డాక్టర్లు కాపాడారు. పాప కడుపులో నుండి బ్యాటరీని డాక్టర్లు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ పొరపాటున బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగింది. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పపిపాప బ్యాటరీ మింగిన విషయాన్ని గుర్తించిన తల్లి వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి.. విజయవాడకు తీసుకెళ్లమని రిఫర్‌ చేశారు. అంబులెన్సులో విజయవాడలోని ఆయుష్‌ ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లారు.

డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూడగా.. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్‌ అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు పసిపాపను వేగంగా ఆస్పత్రికి తరలించారు. ఈ కారణంగానే ప్రమాదం తప్పిందని, పాప ప్రాణాలు నిలిచాయని డాక్టర్లు తెలిపారు. బ్యాటరీపై ఉండే స్టీల్‌ కోటింగ్‌ తొలగిపోయి, కాస్త ఉబ్బిందని.. ఆస్పత్రికి తీసుకురావడం కాస్తా ఆలస్యం అయితే ప్రమాద తీవ్రత ఎక్కువ అయ్యేదన్నారు. కానీ.. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదనీ, కొన్ని గంటలు పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపించామని తెలిపారు.

Next Story