ఏపీలో నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. రూల్స్ ఇవే
నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
By అంజి
ఏపీలో నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. రూల్స్ ఇవే
అమరావతి: నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 8.45 గంటల నుంచే సెంటర్లలోకి అనుమతిస్తారు. 6.49 లక్షల మంది విద్యార్థుల కోసం 3,450 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి ఉండదు. హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
అటు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ పరీక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ నెల 28వ తేదీన ముగియనున్నాయి. మొత్తం 30,334 మంది కోసం 471 సెంటర్లు ఏర్పాటు చేశారు.
టెన్త్ విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్టు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుని, జయప్రదంగా పరీక్షలు రాయాలన్నారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల ఎగ్జామ్స్ హాజరయ్యే సమయంలో హాల్ టికెట్ పోగొట్టుకున్నా..లేక మర్చిపోయిన కంగారు పడాల్సిన అవసరం లేదని ఇందుకోసం ఓ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ కేటాయించింది.ఈ(95523 00009) వాట్సాప్ నంబర్ అందుబాటులో ఉంచారు. అదే విధంగా 08662874540 హెల్ప్‌లైన్ నెంబరు ఏర్పాటు చేసారు.