పులివెందులలో టెన్షన్ టెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్ట్
పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు.
By అంజి
పులివెందులలో టెన్షన్ టెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్ట్
అమరావతి: పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, వైసీపీ నేత సతీష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్‌చేశారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాంటి నిరసనలు, అల్లర్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అటు ఏ క్షనం ఏం జరుగుతుందోనని పులివెందుల ప్రజలు టెన్షన్ పడుతున్నారు.
తన ఇంటి చుట్టూ బయటి ప్రాంతరాల వ్యక్తులు తిరుగుతున్నారని, కర్రలతో ఓటర్లను బెదిరిస్తున్నారని పులివెందుల జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఆరోపించారు. ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం ఏశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బయటి వ్యక్తులు డిన్నర్ ఏర్పాటు చేసుకున్నారని, దీనికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే గెలిచేది తానే అని చెప్పారు.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పులివెందులలో 15, ఒంటి మిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు మండలాల్లో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులు ఉన్నారు. రెండు స్థానాల్లోనూ ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నెలకొంది.