Andhra Pradesh: ఆ అవమానంతో కసిగా చదివి.. సివిల్స్ సాధించిన కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి
తెలుగు పోలీస్ కానిస్టేబుల్ అవమానం తర్వాత పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత యూపీఎస్సీని ఛేదించాడు.
By అంజి
Andhra Pradesh: ఆ అవమానంతో కసిగా చదివి.. సివిల్స్ సాధించిన కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి
తెలుగు పోలీస్ కానిస్టేబుల్ అవమానం తర్వాత పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత యూపీఎస్సీని ఛేదించాడు. "సీఐ నన్ను 60 మంది పోలీసుల ముందు అవమానించాడు. అదే రోజు ఉద్యోగానికి రాజీనామా చేసి యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ కావడం ప్రారంభించాను" అని యూపీఎస్సీ -2023లో 780వ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్ణా రెడ్డి చెప్పాడు. ఆ సమయంలో సీఐ చేసిన అవమానమే సివిల్స్ సాధించేందుకు దోహదపడిందన్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి 2023 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 780వ ర్యాంక్ సాధించాడు. అతను 2013 నుండి 2018 వరకు పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశాడు. వ్యక్తిగత ద్వేషం కారణంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తనను 60 మంది పోలీసుల ముందు అవమానించాడని చెప్పాడు. 'నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. యుపిఎస్‌సిని చేధించి ఐఎఎస్ అధికారి కావాలని నిర్ణయించుకున్నాను' అని అతను చెప్పాడు.
ఉదయ్ కృష్ణ రెడ్డి ఇండియన్ రెవిన్యూ సర్వీస్‌కు కేటాయించబడవచ్చు, అయితే అతను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికయ్యే వరకు సన్నద్ధమవుతానని చెప్పాడు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి తండ్రిది సాదాసీదా రైతుకూలీ కుటుంబం. ఐదేళ్ల వయసులో తల్లి జయమ్మ మృతి చెందారు. తండ్రి శ్రీనివాసులురెడ్డి భరోసా, నానమ్మ రమణమ్మ బాధ్యతలు చూశారు. తండ్రి ఉదయ్‌కు సివిల్స్ గురించి చిన్నప్పటి నుంచే చెబుతూ వచ్చారు. ఇంతలో.. ఇంటర్ చదువుతున్న సమయంలో భరోసాగా ఉన్న తండ్రి కూడా కన్నుమూశారు. 2012లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా ఉదయ్ ఎంపికయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గుడ్లూరులో నాలుగేళ్లు, ఆ తర్వాత ఉలవపాడు మండలం రామాయపట్నం మెరైన్ స్టేషన్‌లో కొన్నాళ్లు విధులు నిర్వహించారు.