మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ప్రవేశాలు.. నేడు ఆఖరు

తెలంగాణలోని 205 మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 5వ తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌/ ఒకేషనల్‌ కోర్సుల్లో 2025 - 26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ.

By అంజి  Published on  28 Feb 2025 8:02 AM IST
Telangana, applications, admissions, Minority Residential Schools

మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ప్రవేశాలు.. నేడు ఆఖరు

తెలంగాణలోని 205 మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 5వ తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌/ ఒకేషనల్‌ కోర్సుల్లో 2025 - 26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఆసక్తిగల మైనార్టీ, ఇతర వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 6,7,8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు స్కూళ్లలో ఖాళీలను బట్టి ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ స్కూళ్లలో మైనార్టీలకు ముందుగా సీట్లు కేటాయిస్తారు.

ఇతర వర్గాల వారికి లక్కీ డ్రా ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఇంటర్‌లో పదో తరగతి మెరిట్‌ ఆధారంగా ప్రవేశం పొందవచ్చు. అభ్యర్థుల ఎంపిక, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, అడ్మిషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 24 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలు మే 1 నుంచి 10 వరకు (2025 టెన్త్‌ ఫలితాలు విడుదలైన వెంటనే) చేపడతారు. గురుకులాల్లో సీటు పొందితే ఇంగ్లీష్‌ మీడియంలో విద్య, వసతి కల్పిస్తారు. పూర్తి వివరాలకు http://tmreistelangana.cgg.gov.inను విజిట్‌ చేయండి.

Next Story