తిరుమలను అపవిత్రం చేస్తూ.. టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు: షర్మిల

తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఫైరయ్యారు.

By అంజి  Published on  19 Sept 2024 12:07 PM IST
TDP, YCP, dirty politics, Tirumala, YS Sharmila

తిరుమలను అపవిత్రం చేస్తూ.. టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు: షర్మిల

తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఫైరయ్యారు. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయన్నారు. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని షర్మిల వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే... తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేదా సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ''మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాల ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది'' అని షర్మిల ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

Next Story