చంద్రబాబుకు డీహైడ్రేషన్‌.. ఆందోళనలో టీడీపీ శ్రేణులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

By అంజి  Published on  13 Oct 2023 8:10 AM IST
TDP workers, Chandrababu health, APnews, TDP, Rajamahendravaram

చంద్రబాబుకు డీహైడ్రేషన్‌.. ఆందోళనలో టీడీపీ శ్రేణులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబుకు సరైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు జైలు అధికారులను కోరారు. డీహైడ్రేషన్ అయిందని గతంలోనే చంద్రబాబు కుటుంబ సభ్యులతో చెప్పారు. ఇప్పుడు చర్మ సంబంధ సమస్యతో చంద్రబాబు బాధపడుతున్నారు. తీవ్ర ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నారని సమాచారం. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే జైలు అధికారులు చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో ఎట్టకేలకు జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్‌ .. చంద్రబాబు నాయుడు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జైలులోని వైద్యులకు చంద్రబాబు తన చర్మ సమస్యను చెప్పారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇద్దరు వైద్యులు వచ్చి చంద్రబాబు ఆరోగ్యం పై పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందన్న జైలు అధికారులు తెలిపారు. ఎటువంటి భయాందోళన, అపోహలకు గురికావద్దని జైలు అధికారులు వెల్లడించారు. వైద్యులు సూచించిన మందులను అందిస్తామని వెల్లడించారు.

Next Story