Road Accident: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేతకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి.

By అంజి  Published on  16 May 2023 5:54 AM GMT
TDP, Prakasam district incharge, Kandula Narayana Reddy, road accident

Road Accident: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేతకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి కూడలి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నారాయణరెడ్డి తలకు స్వల్ప గాయం కాగా, కుడి కాలు విరిగింది. 108 వాహనంలో యర్రగొండపాలెంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో కందుల నారాయణరెడ్డి, డ్రైవర్ మాత్రమే ఉండగా అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు కూడా ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సోమవారం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో కందుల నారాయణరెడ్డి పాదయాత్ర చేపట్టారు.

Next Story