టీడీపీ ఎమ్మెల్యే భ‌ర్త అరెస్ట్‌

TDP MLA Adireddy Bhavani Husband Adireddy Vasu Arrested. రాజమహేంద్రవరంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు

By M.S.R  Published on  30 April 2023 4:47 PM IST
టీడీపీ ఎమ్మెల్యే భ‌ర్త అరెస్ట్‌

రాజమహేంద్రవరంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగదీశ్వరి, జగజ్జనని చిట్స్ నిర్వహణ వ్యవహారంలో వీరిని రాజమహేంద్రవరం కార్యాలయంలోనే విచారిస్తున్నారు. ఉదయం వీరిని అదుపులోకి తీసుకుని సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఆదిరెడ్డి వాసు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వాని భ‌ర్త‌.

ఇదిలావుంటే.. వైసీపీ కేడీలకు సీఐడీ అధికారులకు తేడా లేకుండా పోయిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీవివాస్ ల అక్రమ అరెస్ట్ దుర్మార్గం అన్నారు. వైసీపీ కేడీలు టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. సీఐడీ అధికారులు సోదాల పేరుతో టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారన్నారు. ఆదిరెడ్డి కుటుబం నీతి నిజాయితీ ఏంటో రాజమండ్రి ప్రజల్ని అడగండి చెబుతారు. జగన్ రెడ్డి ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినా భయపడేది లేదన్నారు. జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని గోదావరి నదిలో కలిపేంతవరకు విశ్రమించేది లేదని తెలిపారు. అరెస్టు చేసిన ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లను వెంటనే విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యమని తెలిసే జనం దృష్టి మళ్లించేందుకు ఆదిరెడ్డి కుటుంబంపై సీఐడీని వదిలారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు.


Next Story