నా భర్తకు ఏం జరిగినా సీఎందే బాధ్యత: టీడీపీ నేత పట్టాభి భార్య

TDP Leader Pattabhi wife chandana fire on police. విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

By అంజి  Published on  21 Feb 2023 6:33 AM GMT
నా భర్తకు ఏం జరిగినా సీఎందే బాధ్యత: టీడీపీ నేత పట్టాభి భార్య

విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆచూకీ తెలియజేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన భార్య చందన మంగళవారం పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని బెదిరించారు. సోమవారం సాయంత్రం విజయవాడ సమీపంలోని గన్నవరంలోని టీడీపీ కార్యాలయానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతుదారులు దాడి చేసిన సమయంలో పట్టాభిరామ్‌ అదృశ్యమైనట్లు ఆమె విలేకరులకు తెలిపారు. పట్టాభి కారు కూడా రోడ్డుపై పాడైపోయిందని ఆమె తెలిపారు.

''అతడ్ని పోలీసులు అరెస్టు చేశారా లేక వైసీపీకి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేశారో మాకు తెలియదు. నిన్న రాత్రి నుంచి మాకు ఎలాంటి సమాచారం అందలేదు'' అని ఆమె తెలిపారు. తన భర్తకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చందన పునరుద్ఘాటించారు. ''నా భర్త కారు డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు (PA) స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు, కానీ నా భర్త కనిపించలేదు. పోలీసులు అతన్ని ఎక్కడికి తరలించారో నాకు పూర్తిగా తెలియదు'' అని చందన అన్నారు.

తన భర్త ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉందని ఎత్తి చూపిన ఆమె.. ఆయనకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి, డీజీపీ ఇద్దరూ బాధ్యత వహించాలన్నారు. సోమవారం సాయంత్రం గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ మద్దతుదారులు దాడి చేశారు. ఆవరణలో ఉన్న వాహనానికి నిప్పుపెట్టి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తమ నేతపై టీడీపీ నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యలపై మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినందుకు వంశీని తప్పుబట్టినట్లు మాత్రమే టీడీపీ నేతలు చెబుతున్నారు.

Next Story