తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర ఆదివారం నాటికి 78వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్‌లోని కడితోట క్రాస్ క్యాంపు నుంచి యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా గణేకల్ క్రాస్ వద్ద స్థానికులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం భల్లేకల్ క్రాస్‌లో స్థానికులతో చర్చలు జరిపి అనంతరం కుప్పగల్ శివారులో బీసీ సంఘాలతో సమావేశం కానున్నారు.
పెదతుంబళంలో స్థానికులతో నారా లోకేష్ సమావేశం కానున్నారు. రాత్రికి తుంబళం క్రాస్‌లోని రిసార్ట్ సెంటర్‌లో నారా లోకేష్ బస చేయనున్నారు. మరోవైపు యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఆదోని పట్టణంలోని రాయనగర్ సమీపంలో పాదయాత్ర 1000 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇస్వీ దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మహిళలు, యువకులు, కార్మికులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి లోకేష్‌ను కలుసుకుని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.