ట్విట‌ర్‌లో గోరంట్ల కోటి రూపాయ‌ల ప్ర‌శ్న‌.. ఏపీకి ఆరోగ్య మంత్రి ఎవరు..?

TDP leader Gorantla Butchaiah Chowdary satires on AP Health Minister.ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని తెలుగుదేశం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2021 2:31 PM IST
ట్విట‌ర్‌లో గోరంట్ల కోటి రూపాయ‌ల ప్ర‌శ్న‌.. ఏపీకి ఆరోగ్య మంత్రి ఎవరు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి టార్గెట్ చేశారు. ఆస్ప‌త్రులు, నాడు-నేడు, ప‌రిశ్ర‌మ‌ల విష‌యంలో ప్ర‌భుత్వ ప‌నితీరు స‌రిగా లేద‌ని విమ‌ర్శించారు. ఇక రాష్ట్రంలో వైద్యం ప‌డ‌కేసింద‌ని, ఆస్ప‌త్రుల‌కు స్తుస్తు చేసింద‌ని రోగులు, డాక్ట‌ర్లు ఇబ్బందులు ప‌డుతున్న‌ప్ప‌టికీ ప‌ట్టించుకునేవారు క‌రువ‌య్యార‌న్నారు. 'కోటి రూపాయ‌ల ప్ర‌శ్న‌..! ఏపీకి ఆరోగ్య మంత్రి ఎవ‌రు..? బ‌హుశా దేశంలోనే ఇలాంటి మంత్రి ఎవ‌రు ఉండి ఉండ‌రు. ఒక‌వేళ తెలిస్తే స‌ద‌రు మంత్రి ఆఫీసుకి వెళ్లి ఆరోగ్య బాధ్య‌త‌ని గుర్తు చేద్దామ‌ని' ట్వీట్ చేశారు.


సరైన వసతులు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేయడం ఎలా ముఖ్యమంత్రి జగన్‌గారు అని ప్ర‌శ్నించారు. ఆస్ప‌త్రుల్లో రోగుల ఇబ్బందులు ప‌ట్టించుకోకుండా, డాక్ట‌ర్లు ఇబ్బందులు ప‌ట్టించుకోకుండా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ఆరోగ్య శాఖ మొద్దు నిద్ర పోతుంద‌ని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మండిప‌డ్డారు.

Next Story