జగన్ అక్రమాలను చెప్పుకోవాలంటే ఎన్నో మహానాడులు కావాలి : చంద్రబాబు

TDP Leader Chandrababu Fire On CM Jagan. ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరంలో మహానాడు జరుపుకోవడం సంతోషకరమ‌ని జాతీయ అధ్యక్షుడు

By Medi Samrat  Published on  27 May 2023 9:12 AM GMT
జగన్ అక్రమాలను చెప్పుకోవాలంటే ఎన్నో మహానాడులు కావాలి : చంద్రబాబు

ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరంలో మహానాడు జరుపుకోవడం సంతోషకరమ‌ని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోనే తెలుగు జాతిని ముందుంచాలని ఈ మహానాడు వేదిక ద్వారా సంకల్పిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందన్నారు. శుభానికి సూచకం పసుపు, రైతుకు చిహ్నం నాగలి, సంక్షేమంగా చక్రాలు, కామన్ మ్యాన్ వాహనం సైకిల్ గుర్తు ఎన్టీఆర్ సృష్టి అని అన్నారు. 4 ఏళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారు. తప్పుడు కేసులు పెట్టారు. జీవో నెం.1 వంటి చీకటి జీవోలను తెచ్చారు. ఏ ఒక్క నాయకుడు భయపడలేదు. మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్యను చంపే ముందు జగన్ అంటే వదిలిపెడతామని చెప్పినా కూడా జై తెలుగుదేశం అన్నారు. అందుకే ఆయన పాడె మోసాను. ప్రతి ఒక్క కార్యకర్తకు చంద్రన్న అండగా ఉంటాడు. కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి నా ధ్యేయం అన్నారు.

సంక్షేమ కార్యక్రమాలకు చిరునామా తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ రూ.2 కేజీ బియ్యం, పక్కా ఇళ్లు, సగం ధరకే కరెంట్, పించన్ ప్రారంభం ఎన్టీఆర్ తోనే. ఫించన్ 10 రెట్లు పెంచిన పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. వందల కొద్ది సంక్షేమ పథకాలను పేదలకు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో సంపద సృష్టించి ప్రపంచ పటంలో ఉంచిన ఘనత టీడీపేకే దక్కుతుందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత.. 2029కి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంచాలని ప్రణాళికలు రచించాం. వ్యవసాయ రంగాన్ని 11 శాతం వృద్ధి చెందించాం, జలవనరులకు రూ.64వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు తెచ్చాం. అవి గ్రౌండ్ అయ్యి ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు దొరికి ఉండేవన్నారు.

ఒక్క చాన్స్ అన్నాడు, ముద్దులు పెట్టాడు, తండ్రి లేని బిడ్డను అన్నాడు, కోడి కత్తి డ్రామా ఆడి ఒక సైకో అధికారంలోకి వచ్చాడని ఫైర్ అయ్యారు. ప్రజావేదిక ద్వారా విధ్వంసానికి నాంది పలికాడు. పరిపాలన రివర్స్ లో పెట్టాడు. రాష్ట్రం భవిష్యత్ దెబ్బతింది. అమరావతి సర్వనాశనానికి పూనుకున్నాడు. మూడు రాజధానుల పేరుతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేశారని సీఎం జ‌గ‌న్‌పై ధ్వ‌జ‌మెత్తారు.

పోలవరం పూర్తి అయ్యి నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఎకరాకు నీరందించాలని పనులు చేస్తే.. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని మండిప‌డ్డారు. ఒక్క రోడ్డు వేసిన ధాఖలాలు లేవు. వ్యవసాయం పూర్తిగా భ్రష్టుపట్టింది. ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోయింది. పెట్టుబడులు రావడం లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. నిరుద్యోగులు ఏం చేయాలని దిక్కు తెలియని పరిస్థితి. చదువు కోవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తుందని అన్నారు. లేని చట్టం పేరుతో దిశ పోలీస్ స్టేషన్ ను రాజమండ్రిలో జగన్ ప్రారంభించారు. హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి అధికారంలోకి వచ్చాక కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. అమ్మ ఒడి నాటకం, నాన్నబుడ్డి వాస్తవమ‌న్నారు. మద్యపాన నిషేదం అని హామీనిచ్చి మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని అన్నారు. జగన్ చేసిన అక్రమాలను చెప్పుకోవాలంటే ఇలాంటి మహానాడులు ఎన్నో కావాలన్నారు.

జలజీవన్ మిషన్ 18వ స్థానంలో ఉన్నాం. రైతుల ఆత్మహత్యలో ఏపీ 3 స్థానం, అప్పుల్లో 1వ స్థానం, విదీశీ పెట్టుబడుల్లో 14 స్థానంలో ఉందని అన్నారు. రిచెస్ట్ సీఎం జగన్ రెడ్డి. పేదలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాత్రం ధనికుడు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంలో ప్రైవేట్ ఆసుపత్రులన్ని సహాయ నిరాకరణ చేశారన్నారు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు కలిస్తే రూ.500 కోట్లు.. ఒక్క ఏపీ ముఖ్యమంత్రి ఆస్తి రూ.510 కోట్లు. పేద రాష్ట్రానికి ధనిక ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.

ఇసుక, మధ్యం, భూములు, ఖనిజ సంపద ఏది దొరికితే అది దోచుకుంటున్నారు. రూ.2.27 లక్షల కోట్లు ఇప్పటి వరకు దోచుకున్నారని అన్నారు. దేశంలోనే అత్యధిక ధరలు ఉండే రాష్ట్రం ఏపీ.. ఎక్కువ కేసులు పెట్టే రాష్ట్రం కూడా ఏపీనే అని ఆరోపించారు. ఎక్కడో ఉండే అమూల్ ను ఇక్కడకు తెచ్చారు మన అమూల్ బేబి. ప్రతి స్కీమ్ లోను స్కాం. స్కాంలో జగన్ రెడ్డిది మాస్టర్ మైండ్. సైకో రెడ్డిది అబద్దాల పొట్ట. కోడి కత్తి డ్రామా నుంచి వివేకానంద రెడ్డి వరకు అన్ని అబద్దాలే. రావణాసురుడు సీతను అపహరించడానికి మారు వేషంలో వస్తాడు. అలాగే జగన్ రెడ్డి ప్రజలను సర్వనాశనం చేయడానికి వచ్చాడని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

రూ.2000 నోట్లు ఎక్కడా కనపడలేదు. దేశంలోని నోట్లన్ని జగన్ రెడ్డి గ్యాంగ్ దాచిపెట్టుకున్నారని ఆరోపించారు. డిజిటల్ కరెన్సీకి నాంది పలికిన ప్రభుత్వం టీడీపీ. పెద్ద నోట్లను రద్దు చేస్తేనే నీతి వంతమైన ప్రభుత్వం వస్తుందని ఎప్పుడో చెప్పాం. పబ్లిక్, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ అనే పీ4తో పేద వాడిని ధనికుడి చేసేందుకు నాంది పలుకుదాం. రేపు ఫేజ్ 1 మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నాం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించిన పనుల వలన దేశానికే నెంబర్1 రాష్ట్రంగా నిలిచింది. ఏపీలో విధ్వంసకర పాలన వలన చివర స్థానంలో ఉంటున్నామ‌న్నారు. మళ్లీ ఈ రాష్ట్రాన్ని గట్టెంక్కించే విధంగా కార్యక్రమాలు రూపొందించేలా ప్రణాళికలు రచిస్తున్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిధ్ధంగా ఉందన్నారు.


Next Story