'జగన్.. ఇక నీ ఆటలు‌ సాగవు'.. బుద్ధా వెంకన్న ఫైర్‌

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదిస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయట పెట్టాయన్నారు.

By అంజి  Published on  19 Feb 2025 12:27 PM IST
TDP leader Buddha Venkanna, YS Jagan, APNews

'జగన్.. ఇక నీ ఆటలు‌ సాగవు'.. బుద్ధా వెంకన్న ఫైర్‌

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదిస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయట పెట్టాయన్నారు. ఒక పథకం ప్రకారం.. కిరాయి మూకలను తీసుకుని వైఎస్‌ జగన్‌ విజయవాడకు వచ్చాడని అన్నారు. పోలీసులు ముందే పసిగట్టి ఎక్కడికక్కడ అడ్డుకున్నారని తెలిపారు. వంశీని కలిసిన తరువాత జగన్ పని అయిపోయిందన్నారు. నందిగం సురేష్ ని ఇలా ఎందుకు కలవలేదని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

''కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, దేవినేని అవినాష్ అంటే చంద్రబాబుకు అసూయ అంట.. జగన్ వ్యాఖ్యలు చూసి వంశీ సతీమణి అక్కడే నవ్వుకుంటున్నారు.. వీడియో చూసుకో'' అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా తొడలు కొట్టి, మీసం తిప్పి, జబ్బలు చరిచారు.. ఇప్పుడేమైంది అంటూ సెటైర్లు వేశారు. ''కొడాలి నాని నిన్న జగన్ తో వచ్చి .. మళ్లీ అప్పుడే వెళ్లిపోయాడు. సవాళ్లు చేసిన కొడాలి నానికి ఎందుకంత భయం. గన్నవరం లో చంద్రబాబు నిలపెట్టిన వెంకట్రావు చేతిలో వంశీ, గుడివాడ లో కొత్త అభ్యర్థి చేతిలో కొడాలి నానీ లు ఓడిపోయినా సిగ్గు రాలేదు'' అంటూ ధ్వజమెత్తారు.

''వంశీ, నానీలను నిజంగా లోపల వేయాలంటే నెల్లో నే జైలుకు పంపే వాళ్లం. విజయవాడ లొ బీభత్సం సృష్టించాలని జగన్ ఆలోచన‌ చేశారు. మీ ప్రభుత్వంలో అదే పోలీసులను వాడుకుని అక్రమ కేసులను మా వాళ్ల మీద పెట్టించారు. ఇప్పుడు అదే పోలీసులు సంగతి‌చూస్తా అని జగన్ బెదిరిస్తున్నాడు. వంశీ ని పరామర్శించిన జగన్ చరిత్ర హీనుడిగా మిగిలాడు. జగన్ ఒక్కడే జైలుకి వెళ్లి వంశీతో మాట్లాడవచ్చు కదా.. అరాచకాలు, అల్లర్లు చేసేందుకే కార్యకర్తలు ను వెంటేసుకుని జగన్ వచ్చాడు'' అని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

''చంద్రబాబు పై విమర్శలు చేసిన జగన్ కు వంశీ వ్యాఖ్యలు గుర్తు రాలేదా?. వంశీ... చంద్రబాబు, భువనమ్మ లని తిడితే జగన్ పై శాచిక ఆనందం పొందాడు. వంశీ రౌడీయిజం, బూతులు గురించి జగన్ కు తెలియదా? వంశీ, కొడాలి నాని, అవినాష్ ల దాడులు, బూతులను జగన్ సమర్ధించాడు. ఈసారి పులివెందుల లో కూడా జగన్‌ ఓటమి ఖాయం. వంశీ, నాని, వ్యాఖ్యల‌ వల్లే వైసిపికి నష్టం జరిగిందని ఆ పార్టీ వాళ్లే అంటున్నారు'' అని బుద్ధా వెంకన్న అన్నారు.

''కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం లో‌లా అండర్ కంట్రోల్ లో ఉంది. ఇప్పుడు ఇది చెడగొట్టడమే లక్ష్యం తో జగన్ కుట్ర చేస్తున్నారు. జగన్ పక్కన ఉన్న వారందిపైనా కేసులు ఉన్నాయి. జగన్... ఇక నీ ఆటలు‌ సాగవు.. ప్రజలే నీ సంగతి తేలుస్తారు. ఇప్పుడు అయినా ప్రజలకు మేలు చేసేలా పని చేయండి. వంశీ, కొడాల నానీల నోటి‌ దూల వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వాళ్ల‌ పాపం పండింది.. చట్టపరంగా చర్యలు తప్పవు. మేము వాళ్ల లాగా చట్ట విరుద్దంగా పని చేయం. అధికారంలో ఇష్టం వచ్చినట్టు వాగిన వారంతా జైలుకి వెళ్లక తప్పదు'' అని బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

Next Story