వేమిరెడ్డికి ఆహ్వానం పలుకుతున్న టీడీపీ

రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

By Medi Samrat  Published on  21 Feb 2024 6:45 PM IST
వేమిరెడ్డికి ఆహ్వానం పలుకుతున్న టీడీపీ

రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు ఫ్యాక్స్ లో పంపారు వేమిరెడ్డి. వైఎసార్సీపికి రాజీనామా చేసిన వేమిరెడ్డి టీడీపిలో చేరనున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. టీడీపీ తరఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతూ ఉంది.

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి దంపతులకు టీడీపీ ఆహ్వానం పలుకుతోందని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కొద్దిసేపటి కిందటే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. నాకు అర్థమైంది ఏంటంటే... వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పది రూపాయలు దానం చేసేవాడు, పది మందికీ సాయపడేవాడు. వీపీఆర్ కన్వెన్షన్ పక్కన పేద పిల్లల కోసం చక్కని స్కూలు కట్టించాడు. ఒక్క రూపాయి తీసుకోకుండా చదువుకునే అవకాశం కల్పిస్తున్నాడు. దేవాలయాలకు దానధర్మాలు, జిల్లా అంతటా మంచినీటి ప్లాంట్లతో విరివిగా సేవలు అందిస్తుంటారు. ఆయనేమీ కుట్రలు, కుతంత్రాలు తెలిసిన సగటు రాజకీయ నాయకుడు కాదన్నారు.

Next Story