ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ, దాని భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ 157 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మంగళవారం ఎన్నికల సంఘం వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం టీడీపీ 130, జనసేన 20, బీజేపీ ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య జరిగిన సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ ఆరు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.
జనసేన రెండు లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 సెగ్మెంట్లలో ఆధిక్యంలో ఉండగా, ముఖ్యమంత్రి జగన్ పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీడీపీ ప్రత్యర్థి బి రవిపై 21,292 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కుప్పం, మంగళగిరి అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రత్యర్థి కేఆర్‌జే భరత్‌పై నాయుడు 6832 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ ప్రత్యర్థి వీ గీతపై 22,818 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఆర్కే రోజా, బొత్స సత్యనారాయణ, సి గోపాలకృష్ణ, ఎస్ అప్పలరాజు, అంబటి రాంబాబు, వి రజిని, టి వనిత, అమర్‌నాథ్, అంజాద్ బాషాలు వైఎస్ఆర్‌సిపి మంత్రుల్లో వెనుకంజలో ఉన్నట్లు ఈసీ తాజా గణాంకాలు చెబుతున్నాయి.