11 నుంచి కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు

TDP Chief Chandrababu tour in Kuppam.తెలుగు దేశం పార్టీ అధినేత‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు తాను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Oct 2021 12:07 PM IST
11 నుంచి కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ అధినేత‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 11 నుంచి నాలుగు రోజుల పాటు ఆయ‌న ప‌ర్య‌ట‌న సాగ‌నుంది. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఇప్ప‌టికే తెలుగు త‌మ్ముళ్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. 11న బెంగళూరు మీదుగా రోడ్డు మార్గంలో చంద్రబాబు కుప్పం చేరుకోనున్నారు. 11, 12 తేదీల్లో కుప్పం మునిసిపాలిటీ, మండలంలో, 13న శాంతిపురం రామకుప్పం మండలాల్లో, 14న గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో ఆయన పర్యటించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌జ‌లు, పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అవుతారు.

Next Story