భేషజాలు పక్కన పెట్టి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి : చంద్రబాబు
TDP Chief Chandrababu Naidu Fires on AP Govt over Chalo Vijayawada Issue.ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పీఆర్‌సీ
By తోట వంశీ కుమార్ Published on 3 Feb 2022 9:25 AM GMTఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. చలో విజయవాడ కార్యక్రమంపై జగన్ సర్కారు నియంతృత్వ ధోరణిని ఖండిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. విశ్వనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. రివర్స్ పీఆర్సీని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, నియంతృత్వం వీడి సమస్యలకు పరిష్కారం చూపాలని హితవు పలికారు.
లక్షలాది ఉద్యోగులకు సంబంధించిన సమస్య అని, అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలన్నారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా? రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని నిలదీశారు. రాజకీయ పార్టీల నేతలను ఎలా గృహనిర్బంధాలు చేస్తున్నారో, ఉద్యోగులను కూడా అదే తరహాలో నిర్బంధిస్తుండడం జగన్ వైఖరిని స్పష్టం చేస్తోందని విమర్శించారు.
పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం.. విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమే. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారు. ఉద్యోగులను అగౌరపరిచే.. ఆత్మగౌరవం దెబ్బతీసే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలన్నారు.
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాము. కానీ జగన్ సర్కార్ లా.. ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదు. ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా అని చంద్రబాబు అన్నారు.
లక్షల ఉద్యోగుల సమస్యపై అహంకారంతో కాకుండా...ఆలోచనతో స్పందించాలి.ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా?ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా..రాష్ట్రంలో భాగస్వాములు కాదా?రాజకీయపక్ష నేతలపై పెట్టినట్లు ఉద్యోగులపై గృహ నిర్భంధాలు సిఎం జగన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి(2/5)
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2022
ఉద్యోగులను అగౌరపరిచే...ఆత్మగౌరవం దెబ్బతీసే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాము.(4/5)#TDPSupportsGovtEmployees
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2022