చంద్రబాబు ప్రమాణస్వీకారానికి జూ.ఎన్టీఆర్‌కు ఆహ్వానం, వస్తారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు తీసుకోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ
By Srikanth Gundamalla Published on 11 Jun 2024 7:53 PM ISTచంద్రబాబు ప్రమాణస్వీకారానికి జూ.ఎన్టీఆర్‌కు ఆహ్వానం, వస్తారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు తీసుకోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన ప్రమాణస్వీకారం బుధవారం గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కనీసం అధికార పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
బుధవారం చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే.. జనసేనకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు? బీజేపీకి ఏ పదవి అప్పజెప్పనున్నారు? ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి ఇప్పటికే ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లారు. చిరంజీవితో పాటు.. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో రామ్‌చరణ్ కూడా పాల్గొంటారు. వీరితో పాటే.. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందిందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ చాలా కాలంగా టీడీపీ కార్యకలాపాలకుదూరంగా ఉంటున్నారు. కానీ.. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ పార్టీతో ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చిన ప్రతిసారి.. అలాంటిదేమీ లేదని ఆయన చెబుతూనే వచ్చారు. కానీ.. ఎప్పుడూ కలిసిన సందర్భాలు లేవు. కానీ.. ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో చంద్రబాబుతో పాటు.. బాలకృష్ణ, నారా లోకేశ్ కు ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. మరి ఈ క్రమంలో ఎన్టీఆర్.. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు అవుతారా? లేదా అన్ని ప్రశ్నార్థకంగా మారింది. ఒక వేళ షూటింగ్‌లో బిజీ ఉంటే రావడం మాత్రం కష్టమే అంటున్నారు.