'సాధన దీక్ష' పేరుతో రేపు టీడీపీ ఆందోళనలు
TDP calls Sadhana Deeksha from tomorrow.ఏపీ ప్రభుత్వంపై మరో పోరుకు సిద్దమైంది టీడీపీ. కరోనా బాధితులను
By తోట వంశీ కుమార్ Published on
28 Jun 2021 1:45 PM GMT

ఏపీ ప్రభుత్వంపై మరో పోరుకు సిద్దమైంది టీడీపీ. కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో టీడీపీ పార్టీ ఆందోళనకు సిద్దమవుతోంది. 'సాధన దీక్ష' పేరుతో రేపు ఏపీ వ్యాప్తంగా నిరసన దీక్షలను చేపట్టబోతోంది. అవరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఆయనతో పాటు 15 మంది పార్టీ సీనియర్ నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిని దక్షిణ భారతదేశ విద్యాకేంద్రంగా మార్చాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఆ విజన్ ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందారని అన్నారు. చదువు పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు ఏడాదికి రూ. 50 లక్షల వేతనం వచ్చే ఉద్యోగాలను పొందారని చెప్పారు. ఇవాళ అమరావతి చేరుకోనున్న చంద్రబాబు.. రేపు మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో దీక్ష చేయనున్నారు.
Next Story