Video: మంత్రి రోజాకు కౌంటర్.. సీటు పంచుకునే ముందు స్వీట్ షేరింగ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌లో ఉన్న తీవ్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని పరిణామాలకు దారి తీస్తోంది.
By అంజి Published on 15 Sept 2023 11:01 AM ISTVideo: మంత్రి రోజాకు కౌంటర్.. సీటు పంచుకునే ముందు స్వీట్ షేరింగ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌లో ఉన్న తీవ్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని పరిణామాలకు దారి తీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్‌ను టీడీపీ మద్దతుదారులు తీవ్రంగా ఖండించగా, వైఎస్సార్‌సీపీ నేత, మంత్రి రోజా తన క్యాడర్‌కు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. రోజా సంబరాలు, బాలకృష్ణపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తన ప్రెస్ మీట్‌లో రోజా 'సెలబ్రేషన్'ని దిగజార్చే చర్య అని ఎగతాళి చేశారు. ఇదే సమావేశంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోనున్నట్లు ప్రకటించారు.
పవన్ సంచలన ప్రకటన తర్వాత.. టీడీపీ జనసేన నాయకులు జీవీ రెడ్డి, కిరణ్ రాయల్ ఓ న్యూస్ ఛానెల్ డిబెట్‌లో పాల్గొన్నారు. పొత్తుల ప్రకటనపై చర్చిస్తూ.. ఇది రాబోయే మంచి రోజుల కోసం వేడుక అని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు టీడీపీ, జనసేన చేతులు కలపడం శుభ పరిణామమని కిరణ్ రాయల్ లైవ్ డిబేట్‌లో జీవీ రెడ్డితో స్వీట్లు పంచుకున్నారు. 'సీటు పంచుకోకముందే' వారి 'స్వీట్ షేరింగ్' వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు అరెస్టుతో సంబరాలు చేసుకుంటున్న వారికి ఇది 'స్వీట్ కౌంటర్' అని టీడీపీ మద్దతుదారులు అంటున్నారు.
చాలా నెలలుగా ఊహాగానాలు, అంచనాలతో పాటు.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఒక శక్తివంతమైన కూటమి యొక్క తక్షణ అవసరాన్ని తీవ్రతరం చేసినట్లు కనిపిస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ నిర్ణయానికి దారితీసిందని టీడీపీ-జనసేన మద్దతుదారులు భావిస్తున్నారు.