తమిళనాడు, కడప సెంట్రల్‌ జైల్‌కు తీసుకువెళ్ళి కొట్టినా పారిపోలేదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తప్పుడు కేసులపై భయపడేది లేద‌ని వైయస్ఆర్‌సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తిరుపతి పోలీసులు తనపై నమోదు చేసిన తప్పుడు కేసులపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

By అంజి  Published on  28 Nov 2024 6:38 AM GMT
APnews, Chevireddy Bhaskar Reddy, YCP

తమిళనాడు, కడప సెంట్రల్‌ జైల్‌కు తీసుకువెళ్ళి కొట్టినా పారిపోలేదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తప్పుడు కేసులపై భయపడేది లేద‌ని వైయస్ఆర్‌సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తిరుపతి పోలీసులు తనపై నమోదు చేసిన తప్పుడు కేసులపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తన ప్రతిష్టను భంగం కలిగించేలా పోక్సో, ఎస్సీ ఎస్టీ, ఐటి యాక్ట్‌లతో, 11 సెక్షన్‌లతో కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు. అందుకు బాధ్యులైన పోలీస్‌ అధికారులపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు.

చంద్రగిరి నియోజకవర్గం ఎల్లమందలో బాలికపై జరిగిన దాడి ఘటనపై ఎక్కడా కూడా నేను మీడియాతో మాట్లాడలేదు. అయినా కూడా బాలిక పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించానంటూ తిరుపతి పోలీసులు నాపై పోక్సోతో సహా 11 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన 22 రోజుల తరువాత బాలిక తండ్రితో బలవంతంగా స్టేట్‌మెంట్‌ తీసుకుని ఈ కేసు నమోదు చేశారు.

దాడి ఘటన తరువాత బాలిక తండ్రి నాకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తరువాతే నేను తలకోన ప్రాంతంలోని ఆ ఆస్పత్రికి వెళ్లాను. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని పోలీసులకు, వైద్యులకు సూచించాను. అదే సమయంలో బాలిక తండ్రి చాలా ఆవేశంతో ఉన్నారు. బాలిక తండ్రి మాట్లాడుతూ.. తన పరువు పోయినా ఫరవాలేదు. కానీ తన బిడ్డను హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తరువాత మెరుగైన వైద్యం కోసం బాలికను తిరుపతి ఆసుపత్రికి తీసుకు రావడం జరిగింది. బాలిక తండ్రిని మా పార్టీ నేత నాగార్జునరెడ్డి తన కారులో తీసుకువచ్చారన్నారు చెవిరెడ్డి. ఎక్కడా నేను మీడియాతోనూ, పబ్లిక్‌గానూ ఈ ఘటనపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయినా కేసు పెట్టడం దారుణం.

ఘటనకు బాధ్యుడైన వ్యక్తి నుంచి తీసుకున్న రిపోర్ట్‌లోనూ ఎవరి పేర్లు లేవు. బలవంతంగా బాలిక తండ్రితో పోలీసులు సొంతంగా తయారు చేసుకున్న 5 పేజీల స్టేట్‌మెంట్‌ పై సంతకాలు చేయించుకున్నారన్నారు చెవి రెడ్డి. ఇలాంటి కేసులు పెట్టి భయపెట్టి, బెదిరించాలని అనుకుంటే ఎవరూ భయపడేవారు లేరు. 2011–19 వరకు 88 కేసులు పెట్టారు. తమిళనాడు, కడప సెంట్రల్‌ జైల్‌కు తీసుకువెళ్ళి కొట్టారు. అన్నింటినీ ఎదుర్కొన్నాను తప్ప పారిపోలేదు. ఇంకా ఎన్ని సెక్షన్లు పెట్టినా భయపడే సమస్యే లేదని చెవి రెడ్డి చెప్పారు.

Next Story