కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు చివాట్లు..మీడియాలో హైలెట్ కోసమేనా అంటూ సీరియస్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది.
By - Knakam Karthik |
కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు చివాట్లు..మీడియాలో హైలెట్ కోసమేనా అంటూ సీరియస్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఆయన దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కేఏ పాల్ నేరుగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం, కేఏ పాల్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టులో ఒక పిటిషనర్ Article 32 కింద దేశంలోని ఏడు రాష్ట్రాలపై పిటిషన్ వేసిన సందర్భంగా విచారణలో విచిత్రమైన సంభాషణ చోటుచేసుకుంది. పిటిషనర్ అనేక రాష్ట్రాల ప్రభుత్వాలను implead చేస్తూ—తాను వివిధ దేశాలకు ప్రయాణించిన విషయాలు, మీడియాతో తాను మాట్లాడలేదన్న విషయాలు, కోవిడ్ సమయంలో మందుల విరాళాలు ఇచ్చినట్లు వంటి అసంబద్ధమైన విషయాలు ప్రస్తావించసాగాడు.
జస్టిస్ జేకే మహేశ్వరి మరియు జస్టిస్ విజయ్ బిష్ణోయి ధర్మాసనం ఈ పిటీషన్ ను విచారించింది కోర్టు పలుమార్లు పిటిషనర్ కేఏ పాల్ ను ఆపుతూ ఇలా వ్యాఖ్యానించింది: “మీరు ఎందుకు సుప్రీంకోర్టు ముందే వస్తున్నారు? ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం అయితే, హైకోర్టుకు వెళ్లడం సరైనది. పిటిషన్ న్యాయాధికారానికి తగ్గట్లుగా ఉండాలి.” అని సూచించింది.
పిటిషనర్ కేఏ పాల్ మాత్రం వింత వాదనలు వినిపించారు. తాను 155 దేశాలు సందర్శించానని, 747 విమానం లో ప్రయాణించానని, కోవిడ్ సమయంలో క్యూబాకు మందులు పంపించానని ఇలాంటివి చెబుతూ మళ్లీ Article 32 కింద సుప్రీంకోర్టే సరైన ఫోరమ్ అని వాదించాడు. దీంతో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఎవరికైనా సుప్రీంకోర్టుకు రావడం లగ్జరీ లిటిగేషన్ కాదు. మీ పిటిషన్ ముందుగా హైకోర్టులో వేసి, వారి అభిప్రాయం తీసుకురండి.” ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశంపై సంబంధిత హైకోర్టును సంప్రదించవచ్చని తెలిపింది. అవసరమైతే తర్వాత సుప్రీంకోర్టు పిటిషన్‌ను పరిశీలిస్తామని తెలిపింది.