ఏపీ మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ఎస్ఈసీ నిర్ణ‌య‌మే ఫైన‌ల్‌

Supreme court rejected the municipal election petition.ఏపీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌ప‌డింది. రేపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2021 7:02 AM GMT
ఏపీ మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ఎస్ఈసీ నిర్ణ‌య‌మే ఫైన‌ల్‌

ఏపీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌ప‌డింది. రేపు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాగా.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి గ‌తంలో ఇచ్చిన నోటిఫికేష‌న్ ను ర‌ద్దు చేసి కొత్త నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని కొంద‌రు సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై నేడు సుప్రీం కోర్టులో.. జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్ నేతృత్వంలో ధ‌ర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది. ప్రస్తుత నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు అవుతున్నందున కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు పిటిన‌ర్లు. అయితే.. పిటిన‌ర్లు విజ్ఞప్తిని అత్య‌తున్న‌త న్యాయ‌స్థానం తిరస్కరించింది .

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, కొత్త నోటిఫికేషన్ అవసరమా లేదా అన్నది రాష్ట్ర ఎన్నికల సంఘం విచక్షణాధికారం అని స్పష్టం చేసింది. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదని అభిప్రాయపడింది. పిటిష‌న్‌ను ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. అంత‌క‌ముందు పిటిన‌ర్లు దీనిపై ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించగా.. తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే. దీంతో.. మున్సిపల్ ఎన్నికలకు ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది. ఇక.. రేపు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఫ‌లితాల‌ను ఈ నెల 14న ప్ర‌క‌టించ‌నున్నారు.


Next Story
Share it