తిరుమల లడ్డూ వివాదం..తప్పుడు సమాచారంపై చర్యలకు సుప్రీంకోర్టు నిరాకరణ

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారనే ఆరోపణలకు సంబంధించిన కేసు పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది

By -  Knakam Karthik
Published on : 13 March 2026 11:59 AM IST

Andrapradesh, Tirumala Laddu, Supreme Court, TirupatiTemple, SIT Investigation

తిరుమల లడ్డూ వివాదం..తప్పుడు సమాచారంపై చర్యలకు సుప్రీంకోర్టు నిరాకరణ

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారనే ఆరోపణలకు సంబంధించి, సోషల్ మీడియా లేదా బహిరంగ ప్రకటనల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ అంశంపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయస్థానాన్ని "రాజకీయ యుద్ధభూమి"గా మార్చలేమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వివాదంపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు అక్టోబర్ 4, 2024న సుప్రీంకోర్టు ఇప్పటికే ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఎవరి దగ్గరైనా పక్కా ఆధారాలు ఉంటే, వాటిని నేరుగా దర్యాప్తు సంస్థకే సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది. దర్యాప్తును తార్కిక ముగింపుకు తీసుకెళ్లే బాధ్యత సిట్‌పై ఉందని పేర్కొంటూ ఈ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

Next Story