ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది.
By - Knakam Karthik |
ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల హైకోర్టు బెయిల్‌ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నిందితులకు సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. కేసులో సరెండర్ కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని కోర్టు తెలిపింది.
సిట్‌కు 10 రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కౌంటర్‌కు ప్రతిగా రిజోయిండర్ దాఖలు చేసేందుకు ఐదు రోజుల సమయం ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరగా, ఇప్పటికే రెండు రిజోయిండర్లు దాఖలయ్యాయని, మరోటి ఇవాళ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు.
విచారణ సందర్భంగా ఇన్‌కంప్లీట్ చార్జ్‌షీట్ అంశం, స్టాట్యూటరీ బెయిల్‌కు సంబంధించిన 90 రోజుల గడువు, ట్రయల్ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకునే అధికారం వంటి అంశాలపై న్యాయవాదుల మధ్య విస్తృత వాదనలు జరిగాయి. హైకోర్టు ఉత్తర్వుల వల్ల ట్రయల్ కోర్టు ప్రక్రియకు ఎలాంటి అడ్డంకి లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది