విజయవాడ: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది.
కాగా ఈ కార్యక్రమంలో ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్ అనే అంశంపై సెమినార్ నిర్వహించనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న ఈ సెమినార్‌కు సీఎం చంద్రబాబు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు హాజరుకానున్నారు.