పాఠ‌శాల‌కు వెళ్లకుంటే ఇంటికి వలంటీర్‌..!

Supervise Responsibilities to Village Volunteers.క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆన్‌లైన్ కాస్లుల‌లో విద్యార్థులు పాఠాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2021 5:11 AM GMT
పాఠ‌శాల‌కు వెళ్లకుంటే ఇంటికి వలంటీర్‌..!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆన్‌లైన్ కాస్లుల‌లో విద్యార్థులు పాఠాలు వింటున్నారు. కాగా.. కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 18 నెల‌ల త‌రువాత తిరిగి పాఠ‌శాల‌లు తెర‌చుకున్నాయి. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ పాఠ‌శాల‌లు తెరిచేందుకు ప్ర‌భుత్వం నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే విద్యార్థుల క్షేమ‌స‌మాచారాలు తెలుసుకోవ‌డంతో పాటు విద్యార్థులు క్ర‌మం త‌ప్ప‌కుండా పాఠ‌శాల‌లకు హాజ‌రు అయ్యేలా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థి హాజ‌రు న‌మోదు చేసేందుకు 'స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌'ను ప్రవేశపెట్టింది. ఇక ఈ యాప్‌లో విద్యార్థి హాజ‌రును ప్ర‌తి రోజు న‌మోదు చేస్తారు. ప్ర‌తి పాఠశాలకు చెందిన విద్యార్థులంతా క్రమం తప్పకుండా పాఠ‌శాల‌ల‌కు వస్తున్నారా లేదా అన్నది హెచ్ఎంలతో పాటు వలంటీర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థుల హాజరు వివరాలు డీఈఓ కార్యాలయానికి చేరతాయి.

ఒక వేళ విద్యార్థి వ‌రుస‌గా మూడు రోజులు పాఠ‌శాల‌కు హాజ‌రుకాక‌పోతే విద్యార్థి ఉంటున్న ప్రాంతంలోని వలంటీరుకు స‌మాచారం వెలుతుంది. వెంట‌నే ఆ వలంటీరు స‌ద‌రు విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. ఒక‌వేళ విద్యార్థి అనారోగ్యంతో బాధ‌ప‌డుతుంటే.. స‌మీపంలోని ఆస్ప‌త్రికి స‌మాచారం అందిస్తాడు. వేరే ఇత‌ర కార‌ణాలు ఉంటే.. త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం చేర‌వేస్తాడు. ప్రైవేటు పాఠ‌శాల‌లు సైతం విద్యార్థుల హాజ‌రును స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌లో త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేయాల‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది.

Next Story
Share it