Andhra Pradesh: మే 1 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

రాష్ట్ర ప్రభుత్వం మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఈ విద్యా

By అంజి  Published on  26 April 2023 7:00 AM GMT
Summer holidays, AP schools,  Education Department, APnews

Andhra Pradesh: మే 1 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 30 చివరి పని తేదీగా పేర్కొంటూ పాఠశాల విద్యా కమిషనర్ సురేష్‌ కుమార్‌ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి రిపోర్టు కార్డులు ఇవ్వాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12వ తేదీ సోమవారం నుంచి ఏపీలో మళ్లీ పాఠశాలలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

Next Story