విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్‌.. పాఠ‌శాల మూసివేత‌

Students tested corona positive. ఓ ప్రైవేటు పాఠ‌శాల‌లో ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఇద్ద‌రు విద్యార్థుల‌కు క‌రోనా సోకింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2021 11:42 AM IST
Students tested corona positive

గ‌త కొద్ది రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఓ ప్రైవేటు పాఠ‌శాల‌లో ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఇద్ద‌రు విద్యార్థుల‌కు క‌రోనా సోకింది. దీంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా పాఠ‌శాల‌ను మూసేశారు. క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ‌లోని ఓప్రైవేటు పాఠ‌శాల‌లోని ఇద్ద‌రు విద్యార్థుల‌కు రెండు రోజుల క్రితం క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. వెంట‌నే వారిని ఆస్ప‌త్రికి తీసుకువెళ్లి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ పరీక్ష‌ల్లో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. దీంతో పాఠ‌శాల యాజ‌మాన్యం ఈరోజు నుంచి స్కూల్‌ను మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ పాఠ‌శాల‌లో 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. దీంతో ఆ విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

కాగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిన్న‌( సోమవారం ) ఒక్క రోజు 147 మంది కరోనా బారిన ప‌డ్డారు. 22,604 న‌మూనాల‌ను ప‌రీక్షించ‌గా.. 0.65శాతం మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు వంతున నిర్ధారణ అయ్యాయి. ఇక కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 7,185 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,92,008 కేసులు నమోదు కాగా.. 8,83,380 మంది కోలుకున్నారు.




Next Story