సూర్య‌లంక బీచ్‌లో విషాదం.. ముగ్గురు మృతి, మ‌రో ముగ్గురు విద్యార్థుల గ‌ల్లంతు

Students Drown away in Suryalanka beach in Bapatla.బాప‌ట్ల జిల్లాలోని సూర్య‌లంక బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Oct 2022 3:28 PM IST
సూర్య‌లంక బీచ్‌లో విషాదం.. ముగ్గురు మృతి, మ‌రో ముగ్గురు విద్యార్థుల గ‌ల్లంతు

బాప‌ట్ల జిల్లాలోని సూర్య‌లంక బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. విహార‌యాత్ర‌కు వ‌చ్చి స‌ముద్రంలో సాన్నం చేసేందుకు నీళ్ల‌లోకి దిగిన విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెంద‌గా మ‌రో ముగ్గురు గ‌ల్లంతు అయ్యారు.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. విజ‌య‌వాడ సింగిన‌గ‌రంకు చెందిన కొంద‌రు విద్యార్థులు సూర్య‌లంక బీచ్‌కు విహార‌యాత్ర‌కు వ‌చ్చారు. వీరిలో ఎనిమిది మంది విద్యార్థులు తీరంలో స్నానానికి వెళ్లారు. అల‌ల ఉధృతికి కొట్టుకుపోయారు. గ‌మ‌నించిన మృత్స‌కారులు వీరిలో ఇద్ద‌రు విద్యార్థుల‌ను కాపాడారు. మ‌రో ముగ్గురు విద్యార్థుల మృత‌దేహాలు ఒడ్డుకు కొట్టుకువ‌చ్చాయి. మ‌రో ముగ్గురు గ‌ల్లంతు అయ్యారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గ‌త ఈత‌గాళ్ల సాయంతో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చేప‌ట్టారు. మృతులు అభి (15),సిద్ధూ (15),సాయి మ‌ధుగా గుర్తించారు. వీరు ఇంటర్మీ డియట్ చ‌దువుతున్న‌ట్లు తెలుస్తోంది.

Next Story