ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయకపోవడం కేవలం అహంకారం మాత్రమే కాదు, మన దేశ స్వాతంత్ర్య సమరానికి తీవ్రమైన అవమానం అని మండిపడ్డారు. ఆయనకి ప్రజలు ఎలాగూ గుర్తు లేరు, ఇండిపెండెన్స్ డే కూడా గుర్తులేదా అని నిలదీశారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైతే మాత్రం స్వాతంత్య్ర దినోత్సవం ఎలా మర్చిపోతారని ప్రశ్నించారు. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశానికి క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేసారు.
కాగా దేశ స్వాతంత్య్రాన్ని అవమానించిన జగన్ యావత్ భారత దేశానికి క్షమాపణ చెప్పాలని లోకేశ్‌తో సహా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జగన్ ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కాకుండా ఇంటికే పరిమితం అయ్యారు.