కల్లుగీత వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఏపీలో కల్లు గీత వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 335 మద్యం షాపులను కల్లు గీత వృత్తి దారులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

By Knakam Karthik  Published on  21 Jan 2025 4:36 PM IST
andrapradesh, wine shops allotment, tdp

కల్లుగీత వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఏపీలో కల్లు గీత వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 335 మద్యం షాపులను కల్లు గీత వృత్తి దారులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం షాపులు విక్రయాలు జరుపుతున్నాయి. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేట్ దుకాణాలను వేలం పద్ధతిలో కేటాయించింది. ఇందులో భాగంగానే 10 శాతం మద్యం షాపులను గీత వృత్తి కులాలకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల వారీగా షాపులు కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే వారు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది . గీత కులాల దుకాణాలకు దరఖాస్తు రుసుముగా రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు రూ.25లక్షలు చెల్లించాలి.

జిల్లాల వారీగా ఏర్పాటయ్యే మద్యం దుకాణాలు.. అనంతపురంలో 14, శ్రీసత్యసాయిలో 9, అన్నమ య్యలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరిలో 13, కాకినాడలో 16, కోనసీమలో 13, బాపట్లలో 12, గుంటూరులో 13, పల్నాడులో 13, కడపలో 14, కృష్ణాలో 12, ఎన్టీఆర్ లో 11, కర్నూలులో 10, నంద్యా లలో 11, నెల్లూరులో 18, ప్రకాశంలో 18, పార్వతీ పురం మన్యంలో 4, శ్రీకాకుళంలో 18, అనకాపల్లిలో 15, విశాఖపట్నంలో 14, విజయనగరంలో 16, ఏలూరులో 14, పశ్చిమగోదావరిలో 18 షాపులు గీత కులాలకు కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story