జనసేన శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు వద్ద పనిచేసే డ్రైవర్ శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ డెడ్ బాడీని చెన్నై సమీపంలోని ఓ కాలువలో పడేశారు. డెడ్ బాడీని తీసుకెళ్లిన కారు కోట వినూత దంపతులదే కావడంతో పోలీసులు విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
శ్రీనివాస్ మృతదేహాన్ని శ్రీకాళహస్తిలోని నివాసానికి తీసుకువచ్చారు. అన్న మృతదేహాన్ని చూసి అతడి సోదరి బోరున విలపించింది. తన సోదరుడిని చంపేసింది కోట వినూత ఆమె భర్త చంద్రబాబులే అని, తమ కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్టు తెలిపింది. తమ అన్నయ్యను కొట్టి వాళ్ల దగ్గరే పెట్టుకుని చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ న్యాయం చేయాలని, జనసేన వల్ల తమకు న్యాయం జరగకపోతే మరో పార్టీకి వెళ్లి పోరాడతామని స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ రావాలి.. జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి. మేము జనసేన పార్టీలోనే ఉన్నాం. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అన్నారు.