చనిపోయారనుకున్న ప్రేమజంట.. 'మేము బతికే ఉన్నాం' అంటూ నెట్టింట పోస్ట్‌

Srikalahasti Love Couple Video Viral After They Missing 9 Months Back. తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన ఓ ప్రేమ జంట.. తాము బ్రతికే ఉన్నామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్

By అంజి  Published on  31 Oct 2022 11:18 AM IST
చనిపోయారనుకున్న ప్రేమజంట.. మేము బతికే ఉన్నాం అంటూ నెట్టింట పోస్ట్‌

తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన ఓ ప్రేమ జంట.. తాము బ్రతికే ఉన్నామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం.. ఠాగూర్, లలిత శ్రీకాళహస్తిలో నివసిస్తున్నారు. వీరి కుమార్తె చంద్రితకు శ్రీకాళహస్తి రామాపురంకు చెందిన చంద్రశేఖర్‌తో ప్రేమ వ్యవహారం ఉంది. చందశేఖర్ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అప్పటికే వివాహం అయ్యింది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఏడాది జనవరి 10న చంద్రిత, చంద్రశేఖర్‌లు వారి వారి ఇళ్ల నుంచి పారిపోయారు.

అక్టోబర్ 20న కేవీబీ పురం మండలం కోవనూరు సమీపంలోని తెలుగు గంగ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై పుట్టిన గుర్తుల ఆధారంగా చంద్రితదేనని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. తమ కుమార్తె మృతికి కారణమైన చంద్రశేఖర్‌ను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాగా, అక్టోబర్ 22న ఏర్పేడు మండలం బండమానుకాల్వ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు చంద్రశేఖర్‌ తల్లిదండ్రులను పిలిపించగా వారు రాకపోవడంతో. అనంతరం చంద్రిత తల్లిదండ్రులకు ఫోన్‌ చేయగా.. చంద్రశేఖర్‌ అని నిర్ధారించారు.

అనుమానం వచ్చిన పోలీసులు రెండు మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం శ్రీకాళహస్తి మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని చంద్రిత తల్లిదండ్రులు ప్రకటించారు. ఈ పరిస్థితిలో చందశేఖర్, చంద్రిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ''మేము సురక్షితంగా, సంతోషంగా ఉన్నాము. త్వరలో రామాపురం వస్తాం. మా మరణానికి సంబంధించిన వార్తలన్నీ పుకార్లు మాత్రమే.'' అని పేర్కొన్నారు. అయితే ఈ కేసు విచారిస్తున్న పోలీసులు.. డీఎన్ఏ రిపోర్టు తర్వాత మృతలేవరో తెలుస్తుందని చెప్పారు.


Next Story