స్పైస్ జెట్ సేవలు నిలిపివేత

Spice jet airlines services cancelled from vijayawada.విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ విమాన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2021 7:05 AM GMT
స్పైస్ జెట్ సేవలు నిలిపివేత

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ విమాన సేవలు నిలిచిపోయాయి. గ‌న్న‌వ‌రం నుంచి న‌డుస్తున్న స్పైస్ జెట్ విమానాల‌కు 30శాతం ఆక్యుపెన్సీ కూడా లేక‌పోవ‌డంతో స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపింది. అక్టోబర్ వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పైస్‌జెట్‌ సంస్థ ప్రకటించింది. నేటి నుంచే సర్వీసుల రద్దు అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు నిలిపివేశారు. సర్వీసుల రద్దు విషయంపై గన్నవరం విమానాశ్రయం అధికారులకు స్పైస్ జెట్ యాజమాన్యం సమాచారం అందించింది.

విజయవాడ నుంచి స్పైస్‌జెట్‌ కేవలం ఒక్క నగరానికి మాత్రమే సర్వీసులు నడుపుతుంది. గతంలో విజయవాడ నుంచి చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సర్వీసులు నడిపేది. ప్రయాణికులు తగ్గిపోయారన్న కారణాలతో దశలవారీగా ఒక్కో నగరానికి విమాన సర్వీసులను సంస్థ రద్దు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా విమానాశ్రయం నుంచి స్పైస్‌జెట్‌ సర్వీసులు నిలిచిపోయాయి. గన్నవరం నుంచి ఎయిరిండియా, ఇండిగో, ట్రూజెట్‌ విమానాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి.

Next Story
Share it