ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్..వారికి కాఫీ ఇచ్చిన సీఎం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరుకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించారు.
By Knakam Karthik Published on 18 March 2025 3:19 PM IST
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్..వారికి కాఫీ ఇచ్చిన సీఎం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో అరుకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రిబ్బన్ కట్ చేసిన అరుకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించారు.
అరకు ప్రాంతం నుంచి సేంద్రీయ విధానంలో ఉత్పత్తి చేసిన ఈ కాఫీ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, ఇలాంటి ఉత్పత్తులను ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి అరకు కాఫీని స్వయంగా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చొరవకు అనుగుణంగా, తెలుగుదేశం పార్టీ (TDP) పార్లమెంటు సభ్యులు గతంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను అనుసరించి, పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. లోక్‌సభ డిప్యూటీ సెక్రటరీ అజిత్ కుమార్ సాహూ అవసరమైన ఉత్తర్వులు జారీ చేశారు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు అధికారిక లేఖ ద్వారా తెలియజేశారు.