భారీ వ‌ర్షాల కార‌ణంగా 18 రైళ్లు ర‌ద్దు

South central railway cancelled 18 trains.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ద‌క్షిణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Nov 2021 11:30 AM GMT
భారీ వ‌ర్షాల కార‌ణంగా 18 రైళ్లు ర‌ద్దు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. కొన్ని రైళ్ల‌ను దారి మ‌ళ్లించింది. కుండ‌పోత వ‌ర్షాల కార‌ణంగా ఏపీలోని ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మైన విష‌యం తెలిసిందే. న‌దులు, వాగులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌టంతో వాహ‌నాలు, రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

రైలు నెంబ‌ర్ - ప్ర‌యాణం,గ‌మ్య‌స్థానం

20895 రామేశ్వరం- భువనేశ్వర్‌

22859 పూరి- చెన్నె సెంట్రల్‌

17489 పూరి- తిరుపతి

12655 అహ్మదాబాద్‌- చెన్నై సెంట్రల్‌

12967 చెన్నై సెంట్రల్‌- జైపూర్‌

06426 నాగర్‌సోల్‌- తిరువనంతపురం

06427 తిరువనంతపురం- నాగర్‌సోల్‌

06425 కొల్లాం- తిరువనంతపురం

06435 తిరువనంతపురం- నాగర్‌సోల్‌

12863 హౌరా- యశ్వంతపూర్‌

12269 చెన్నై సెంట్రల్‌- హజరత్‌ నిజముద్దీన్‌

12842 చెన్నై సెంట్రల్‌- హౌరా

12656 చెన్నై సెంట్రల్‌- అహ్మదాబాద్‌

12712 చెన్నై సెంట్రల్‌- విజయవాడ

12510 గువహటి- బెంగళూరు కంటోన్మెంట్‌

15930 న్యూ తినుసుకియా - తాంబరం

20890 తిరుపతి- హౌరా రైలు రద్దు

12798 చిత్తూరు- కాచిగూడ

17487 కడప- విశాఖపట్నం

17651 చెంగల్‌పట్టు - కాచిగూడ రైలు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

దారి మళ్లించిన రైళ్ల వివరాలు..

12642 హజరత్‌ నిజాముద్దీన్‌- కన్యాకుమారి

12616 న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్‌

22877 హౌరా- ఎర్నాకుళం

12845 భువనేశ్వర్‌- బెంగళూరు కంటోన్మెంట్‌

22502 న్యూ తిన్‌సుకియా- బెంగళూరు

12270 హజరత్‌ నిజాముద్దీన్‌- చెన్నై సెంట్రల్‌

12655 అహ్మదాబాద్‌- చెన్నై సెంట్రల్‌ రైలు

12622 న్యూదిల్లీ- చెన్నై సెంట్రల్‌ రైలు

12296 దానపూర్‌- బెంగళూరు

12968 జైపూర్‌- చెన్నై సెంట్రల్‌


Next Story