రెండు నెల‌ల్లో పెళ్లి.. జిమ్‌కు వెళ్లి కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

మ‌రో రెండు నెల‌ల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మ‌ర‌ణించాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2023 4:25 AM GMT
రెండు నెల‌ల్లో పెళ్లి..  జిమ్‌కు వెళ్లి కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

ఇటీవ‌ల కాలంలో గుండెపోటు ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. వ‌య‌సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ వ‌స్తోంది. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో హుషారుగా కనిపించిన‌ప్ప‌టికి క్ష‌ణాల్లోనే కుప్ప‌కూలి మ‌ర‌ణిస్తున్నారు. రెండు రోజుల క్రితం హైద‌రాబాద్ న‌గ‌రంలో జిమ్‌లో వ్యాయామం చేస్తూ కానిస్టేబుల్ మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందు క‌ర్నూల్ జిల్లాలోనూ అలాంటి ఘ‌ట‌న‌నే చోటు చేసుకుంది.

ఆదోని ప‌ట్ట‌ణానికి చెందిన 28 ఏళ్ల యువ‌కుడు హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌ని చేస్తున్నాడు. ప్ర‌స్తుతం వ‌ర్క్ ఫ్రం హోం విధానంలో ఇంటి వ‌ద్దే ఉంటూ పని చేస్తున్నాడు. ఇటీవ‌లే అత‌డికి వివాహం నిశ్చ‌య‌మైంది. మే 3న పెళ్లి ముహూర్తాన్ని నిర్ణ‌యించారు.

రోజులాగానే శ‌నివారం ఉద‌యం కూడా ప‌ట్ట‌ణంలోని ఓ జిమ్‌కు వెళ్లాడు. అక్క‌డ వ్యాయామాన్ని చేస్తుండ‌గా క‌ళ్లు తిరిగిన‌ట్లు అనిపించ‌డంతో స్నేహితుడితో క‌లిసి జిమ్ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. స్నేహితుడు నీళ్లు తెచ్చేందుకు వెళ్లాడు. అదే స‌మ‌యంలో అత‌డికి మూర్ఛ వ‌చ్చి ప‌డిపోయాడు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే అత‌డు గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు.

Next Story