వామ్మో..మందు సీసాలో పాము పిల్ల‌

Snake found in liquor bottle in Guntur District. మ‌ద్యం తాగేట‌ప్పుడు ఓ సారి మీరు తాగే బాటిల్ ను జాగ్ర‌త్త‌గా చూడండి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sept 2022 11:23 AM IST
వామ్మో..మందు సీసాలో పాము పిల్ల‌

మందుబాబులారా..? మ‌ద్యం తాగేట‌ప్పుడు ఓ సారి మీరు తాగే బాటిల్ ను జాగ్ర‌త్త‌గా చూడండి. లేదంటే మీ ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డ‌వ‌చ్చు. మ‌ద్యం బాటిల్‌లో పాము పిల్ల క‌నిపించ‌డంతో క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌టన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

పొన్నూరులోని ఓ మ‌ద్యం దుకాణం నుంచి కొంద‌రు యువ‌కులు మ‌ద్యం బాటిల్‌ను కొనుగోలు చేశారు. అయితే.. అందులో పాము పిల్ల క‌నిపించిడంతో భ‌యాందోళ‌న‌కు గురైయ్యారు. వెంట‌నే స‌ద‌రు షాపు వ‌ద్ద‌కు వెళ్లి అస‌లు విష‌యాన్ని చెప్పారు. తాము కొన్న‌దానికి బ‌దులు వేరేది ఇవ్వ‌మ‌ని కోర‌గా.. తొలుత సిబ్బంది అందుకు నిరాక‌రించారు. దీంతో యువ‌కులు షాపు సిబ్బందితో వాగ్వాదానికి దిగ‌గా.. షాపు యాజ‌మాన్యం రాజీకి వ‌చ్చింది. మ‌రో మందు బాటిల్‌ను ఇచ్చి పంపించి వేశారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో పొన్నూరు‌లో మందుబాబులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story